అవార్డులు

  • ప్రముఖ ‘ఇండియా టుడే’ పత్రిక 2003 సంవత్సరంలో దేశంలోనే ‘ఉత్తమ ముఖ్యమంత్రి’ అవార్డుతో పాటు ‘ఐటి ఇండియన్‌ ఆఫ్‌ ది మిలీనియమ్‌’ గా ప్రశంసించారు.
  • ‘బిజినెస్‌ పర్శన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రముఖ ఇంగ్లీష్‌ పత్రిక ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ నుండి అందుకున్నారు.
  • ‘సౌత్‌ ఎషియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అమెరికాకు చెందిన ప్రముఖ ‘టైమ్‌ ఏషియ మ్యాగజైన్‌’ అందజేసారు.
  • ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ ‘సిఎన్‌బిసి టీవి 18’ ‘బిజినస్‌ లీడర్‌’ క్యాటగిరిలో వచ్చినది.
  • దేశంలో మొదటి అత్యున్నత రాజకీయవేత్తగాను ‘విజనరీ అవార్డు’ సైబర్‌ మీడియా లిమిటెడ్‌ అందజేశారు.
  • రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు, 64 ఏళ్ల వయసులో 2,817 కి.మీ. పాదయాత్ర చేసినందుకుగాను బుక్‌ ఆఫ్‌ స్టేట్‌ రికార్డ్స్‌ ‘ఏకవీర’ పురస్కారంతో సత్కరించింది.
  • ‘ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కార్‌ (మోడల్‌ సిఎం అవార్డు) పూణెకు చెందిన భారతీయ చత్ర సన్‌సద్‌ ఇచ్చినది.
  • గోదావరి నుండి కృష్ణాకు ‘పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా అతి తక్కువ సమయంలో అనుసంధానం చేసినందుకు ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’లో ఎక్కింది. భారతదేశంలోనే నదుల అనుసందానం చేసిన తొలి వ్యక్తి, అపరభగీరధుడుగా చరిత్రకెక్కారు.
  • 2014 నుండి 2019 వరకూ ముఖ్యమర్రతిగా ఉన్న చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధికి, వ్యక్తిగతంగా అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం అద్భుతంగా అమలు చేసారు. సి.ఎన్‌.బి.సిటీ.వి 18 వారు ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందజేసారు. ఈజ్‌ ఆప్‌ డైయింగ్‌ బిజినెస్‌లో 2017లో నెం.1 ర్యాంకు, 2016లో 2వ ర్యాంకు సాధించింది. ప్రవేటు కార్పొరేట్‌ పెట్టుబడులలో నెం.1 ర్యాంకు వచ్చింది. ఫారిన్‌ డైరెక్టర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ (ఎఫ్‌డిఐ)లో దేశంలో 2వ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా 201617లో విద్యుత్‌ రంగంలో జాతీయ స్థాయిలో 26 అవార్డులు వచ్చాయి. బెస్ట్‌ నోడల్‌ ఏజన్సీ, సోలార్‌/విండ్‌ పవర్‌లో బెస్ట్‌ పాలసీస్‌, గ్రామీణాబివృద్ధి, మీకోసం పోర్టల్‌, రెవెన్యూ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, వివిధ శాఖలకు లభించాయి. అత్యుతమ నీటి నిర్వహణగాను సాగునీటి రంగానికి నెం.1 అవార్డు వచ్చింది.