కాలేజీ విద్యాబ్యాసం

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో 196869లో ‘ఎకనమిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హీస్టరీ’తో పీయూసీతో కాలేజీ విద్యాబ్యాసం, అదే కళాశాల్లో 196972లో బి,ఏ పూర్తిచేశారు, 1972`74లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్ధికశాస్త్రం ఎం.ఏ (మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌) పట్టాను పొందారు. ఎస్వీయూలో ఆచార్య ఎన్జీ రంగా గ్రామీణ ఆర్ధిక విధానంపై పీహెచ్‌డీ (డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ) చేయాలని అభిలషించిన చంద్రబాబు ఆ దిశగా కొన్నాళ్లు విస్తృతంగా పరిశోధనలు సైతం చేశారు. విద్యార్ధి దశలోనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటంతో పీహెచ్‌డీ చేయాలన్న కోరిక నెరవేరలేదు.
డిగ్రీ చదివే రోజుల్లో నారావారిపల్లె ఇరుగు, పొరుగు గ్రామాల్లోని యువతను సంఘటిత పరిచి శ్రమదానంతో ఐదున్నర కిలోమీటర్ల రోడ్డును విస్తరించి, పంటపొలాలకు సాగునీరు అందిచే కాలువ పనులు, గ్రామల్లో కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం చంద్రబాబులోని చైతన్యశీలత, సేవ తత్సరతలకు మచ్చుతునకలు.


విద్యార్ధి యువ నాయకుడు
విద్యార్ధి దశ నుంచే సామజిక, రాజకీయ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర చంద్రబాబు పోషిస్తూ యువతలో రాజకీయ చైతన్యం తీసుకొసుండేవారు. ప్రాధమికోన్నత, ఉన్నత, కళాశాల వార్షికోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పనలో భాగస్వామ్యమై నటుడిగా రాణించారు. చంద్రబాబు నాయుడు విద్యార్ధి దశలో రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.
1977లో కోస్తా జిల్లాలలో సంభవించిన దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు చంద్రబాబు చదువు వదిలిపెట్టి సహాయకార్యక్రమాలలో పాల్గొన్నాడు. ముందుగా నష్టపోయిన గ్రామాలను సందర్శించి అక్కడ అధ్యయనం చేసి, వారికి కావలసిన సహాయ సామాగ్రిని సేకరించి, ఆ గ్రామలలో వాటిని పంచాడు. నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు చంద్రబాబులోని సేవాభిలాషకు, నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. ఆ సహాయక చర్యల మూలంగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. అప్పటికే తిరుపతి విశ్వవిద్యాలయ రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్న చంద్రబాబు చంద్రగిరిలో తిరుగులేని యువనాయకుడు తీర్చిదిద్దాయి.
విశ్వవిద్యాలయంలో చదువు విషయంలో చంద్రబాబు నాయుడికి బాగా స్ఫూర్తినిచ్చినవాడు ఆర్ధిక శాస్త్ర ఆచార్యుడు డి.ఎల్‌.నారాయణ. ఆయన ద్వారానే చంద్రబాబు నాయుడుకు కాంగ్రేసు పార్టీకి చిత్తూరు పార్లమెంటు సభ్యుడు గల్లా రాజగోపాల నాయుడుతో పరిచయం ఏర్పడిరది. చంద్రబాబు నాయుడు ఆర్ధికశాస్త్రంలో ఎం.ఏ పూర్తిచేసిన తర్వాత లెక్చరర్‌ ఉద్యోగం ఏదీ లభించకపోవడంతో డి.ఎల్‌.నారాయణ సలహాతో ఆయన పర్యవక్షణలోనే పిహెచ్‌.డి.లో ప్రవేశం తీసుకున్నాడు. ఆయన పరిశోధనకు ఎంపికచేసుకున్న పరిశాధనాంశం ఎన్‌.జి.రంగా ఆర్ధిక విధానాలు. ఎన్‌.జిరంగా ఒక ప్రతిభావంతుడయిన అసాధారణ రాజకీయవేత్త. ఆక్స్‌ఫర్డులో చదువుకున్నాడు.