తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో 196869లో ‘ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, హీస్టరీ’తో పీయూసీతో కాలేజీ విద్యాబ్యాసం, అదే కళాశాల్లో 1969
72లో బి,ఏ పూర్తిచేశారు, 1972`74లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్ధికశాస్త్రం ఎం.ఏ (మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్) పట్టాను పొందారు. ఎస్వీయూలో ఆచార్య ఎన్జీ రంగా గ్రామీణ ఆర్ధిక విధానంపై పీహెచ్‌డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) చేయాలని అభిలషించిన చంద్రబాబు ఆ దిశగా కొన్నాళ్లు విస్తృతంగా పరిశోధనలు సైతం చేశారు. విద్యార్ధి దశలోనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటంతో పీహెచ్‌డీ చేయాలన్న కోరిక నెరవేరలేదు.