1977లో చంద్రబాబు నాయుడు తన పిహెచ్.డి అధ్యయానాన్ని వదలిపెట్టి కాంగ్రెేసు పార్టీలో చేరాడు. అదే సమయంలో కాంగ్రేసు పార్టీలో తన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు. విద్యార్ధి నాయకుడుగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు తన 28వ ఏటనే 1978 శాసనసభ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ టికెట్టు సంపాందించాడు. కాంగ్రేసు పార్టీలో ఆ నియోజకవర్గానికి మరెవరూ పోటీపడలేదు. విద్యార్ధులు ఆయన తరపున ప్రచారం చేశారు. అదే సమయంలో ఆయన వయసు వాళ్ళు చాలా మంది అదే విశ్వవిద్యాలయానికి చెందిన యువకులు కాంగ్రేసు పార్టీలో చేరారు. వారందరికి చంద్రబాబు నాయుడు నాయకుడయ్యాడు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనభ్యుడిగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉంటూ చిన్నతరహా పరిశ్రమల డైరెక్టరుగా కొద్దికాలం వ్యవహరించారు.