తొలిసారిగా మంత్రి

1980లో అంజయ్య మంత్రివర్గంలో స్ధానం పొందారు. 1980`83 మధ్య కాలంలో పురావస్తుశాఖ, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమాభికృద్ధి, చిన్న నీటి పారుదల శాఖలను సమర్ధంగా నిర్వహించారు. 1989లో కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు. 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రికార్డు స్ధాయి ఆధిక్యతతో విజయం సాధిస్తూ వస్తున్నారు.