నారావారిపల్లి

దక్షిణ భారతావనిలో భాగమైన నవ్యాంధ్రప్రదేశ్‌లో గల చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం సుప్రసిద్ధి పుణ్యక్షేత్రం తిరుపతికి పశ్చిమ దిశిన సమారు 18 కిలోమీటర్ల దూరంలో నారావారిపల్లిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి. ఆయన చిన్నతనంలో నారావారిపల్లి గ్రామములో కేవలం 12 ఇండ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడవి 31కి పెరిగావి. ఆ గ్రామస్ధులందరు ఒకరికొకరు దగ్గర బంధువులు. ఆ గ్రామ విశేషం ఏమిటంటే గ్రామంలోని ఇండ్లు ఎప్పుడూ నిత్యం నూతనంగా కనిపిస్తాయి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఆ గ్రామ ముఖ ద్వారంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు ఉన్నది.
నారావారిపల్లి చుట్టూ పచ్చని పొలాలు, చిన్న చిన్న వాగులు. ఆ ఊరికి చేరుకోవాలంటే వాటన్నింటినీ దాటుకుని వెళ్లాలి. నారావారిపల్లికి ఎలా వెళ్లాలి అని అడిగితే ఎవరైనా చెబుతారు. ఊళ్లోకి రాగానే ‘కర్జూరనాయుడు గారి ఇల్లెక్కడ అంటే ఇంటి గడప దగ్గర దిగబెడతారు. ఆ చిన్న పల్లెటూరులో ఆయన పలుకుబడి కలిగిన రైతు. నిత్యం ఆ ఇల్లు జనంతో కిటకిటలాడుతూ ఉండేది. తగువులు తీర్చమంటూ వచ్చే వారూ, సమస్యలు పరిష్కరించమంటూ వచ్చే వారూ అదో సందడిగా ఉండేది