తల్లిదండ్రులు
సామాన్య వ్యవసాయ కుటుంబం అయిన తండ్రి నారా ఖర్జూరనాయుడు, తల్లి అమ్మణ్ణమ్మ దంపతులకు నారా చంద్రబాబు నాయుడు, నారా రామమూర్తి నాయుడు, నారా రాజేశ్వరి, నారా హైమావతి అనే నలుగురు సంతానము. నారా కుటుంబంలో నలుగురి సంతానంలో తొలి సంతానంగా ఏప్రిల్20, 1950లో నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లిలో జన్మించారు. ఆయన జన్మించినాటికి 18 అడుగులు (3అంకణాలు) పొడవుతో, బోదతో కప్పబడిన రెండు పూరిండ్లు ముందు వెనుకలగా ఉండేవి. ఇంటి ముందు వరి కసువుతో గడ్డివామి ఉండేది. వాటి క్రిందన ఆగ్నేయ దిశలో వారు వెదురు దబ్బలతో తయారు చేసిన తడికలను ఏర్పాటు చేసుకొని వంట చేసుకొనేవారు. చంద్రబాబు జన్మించిన పన్నెండు సంవత్సరాలకు మిద్దె ఇల్లు (మేడ) కట్టారు.
తండ్రి నారా ఖర్జూరనాయుడు, తల్లి అమ్మణ్ణమ్మ ఘాట్
నారా చంద్రబాబు నాయుడు తాతలు ముగ్గురు. నారా సుబ్బానాయుడు, నారా నాచమనాయుడు, నారా పాపినాయుడు. వీరిలో రెండవ తాతగారైన నాగమనాయుడుకు 1. నారా సుబ్బానాయుడు 2. నారా నారాయణస్వామి నాయుడు 3. నారా శ్రీనివాసులు నాయుడు 4. నారా ఖర్జూర నాయుడు 5. నారా పాపినాయుడు అనే ఐదు మంది కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు. నాల్గొవాడయిన నారా ఖర్జూరనాయుడు భార్య అమ్మణ్ణమ్మ దంపతులకు అనే నలుగురు సంతానము.1. నారా చంద్రబాబు నాయుడు, నారా రామమూర్తి నాయుడు భార్య ఇందిరమ్మ, నారా రాజేశ్వరి భర్త రాజరత్నం నాయుడు, నారా హైమావతి భర్త కనుమూరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడి రాజకీయ ఎదుగుదల ఆయన వ్యక్తిత్వం, పట్టుదల చూసిన నందమూరి తారకరామారావు తన మూడవ కుమార్తె అయిన భువనేశ్వరిని ఇచ్చి 1981 సెప్టెంబరు 10వ తేదీన వివాహం జరిపించారు. ఈ దపంతుల ఏకైక కుమారుడే నారా లోకేష్. ఎన్.టి.రామారావు గారి ఐదవ కుమారుడైన నందమూరి బాలకృష్ణ భార్య వసుందరలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. పెద్ద కుమార్తె నందమూరి బ్రాహ్మణికి నారా లోకేష్‌కు ఇచ్చి అత్యంతవైభవంగా జరిగింది. వీరికి 2015 మార్చి 21న నారా దేవాన్ష్ ఒక కుమారుడు పుట్టాడు. నారా చంద్రబాబు నాయుడు వంశ వారసుడు.