- విద్యార్ధి దశ నుంచే సామాజికి, రాజకీయ కార్యకలాపాల్లో చురుకైనపాత్ర చంద్రబాబు పోషిస్తూ యవతలో రాజకీయ చైతన్యం తీసుకొస్తుండేవారు. ప్రాధమికోన్నత, ఉన్నత, కళాశాల వార్షికోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పనలో భాగస్వామ్యమై నటుడిగా రాణించారు.
- పదో తరగతి చదువుకునే రోజుల్లోనే నారావారిపల్లిలో ‘వినాయక యువజన సంఘం’ పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటుచేసి గ్రామాభివృద్దికి శ్రమించారు. గ్రామంలో మట్టిరోడ్లును వేసి పచ్చదన పెంచడంలో భగంగా మట్టిరోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించి వాటికి పేర్లుపెట్టి రోజూ సంరక్షించే బాధ్యతలు స్నేహితులతో కలిసి చేపట్టారు.
- డిగ్రీ చదివే రోజుల్లో నారావారిపల్లి ఇరుగు. పొరుగు గ్రామాల్లోని యువతను సంఘటిత పరిచి శ్రమదానంతో ఐదున్నర కిలోమీటర్ల రోడ్డును విస్తరించి, పంటపొలాలకు సాగునీరు అందించే కాలువ పనులు, గ్రామాల్లో కాలువల్లో పూడకతీత పనులు చేపట్టడం చంద్రబాబులోని చైతన్యశీలత, సేవాతత్వరతలకు మచ్చుతునకలు.
- 1977లో కృష్ణాజిల్లాలో సంభవించిన దివిసీమ ఉప్పెన సదర్భంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు బాబులోని సేవాభిలాషకు, నాయకత్వ పటిమకు అద్దంపట్టాయి. ఆ సహాయక చర్యల మూలంగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. అప్పటికే తిరుపతి విశ్వవిద్యాలయ రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్న చంద్రబాబు చంద్రగిరిలో తిరుగులేని యువనాయకునిగా తీర్చిదిద్దాయి.
- తొలి రాజకీయ ప్రయత్నంలో 28 ఏళ్లకే ఎమ్యేల్యే, మూడుపదుల వయస్సులో మంత్రి పదవుల్ని పొంది తన 45వ యేటలోపునే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాగలిగిన మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.