తల్లిదండ్రులు ఆదర్శవంతులైనందున చంద్రబాబు నాయుడు కూడా ఉదయం వేకువ జాముననే లేచి కొంతసేపు చదువుకొని పొలం పనులు సైతం చూచుకుని దైవందిన కార్యక్రమంలో నిమగ్నుడయ్యేవాడు. విద్యార్ధి దశ నుంచే సెల్ఫ్ డిసెప్‌లైన్ అలవడిరది. 1957-1962 ఆరేళ్ల వయసులో ఒకటో తరగతి నుంచి నారావారిపల్లి నుంచి 1.5 కి.మీ. దూరంలోని శేషాపురం గ్రామంకు నడచివెళ్లి ప్రాధమిక విద్యను అభ్యసించారు.
మాధ్యమిక విద్య
1962`68 వరకు హైస్కూల్ విద్యను 8వ తరగతి వరకు చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లి నుంచి చంద్రగిరికి సుమారు 6కి.మీ. దూరం ఉంటుంది. ఆయన ఉదయం 4 గ॥లకు లేచి కొంతసేపు చదువుకొని ఆ తరువాత తన తండ్రితో కలసి పొలం పనులు చూసేవారు. 6 గ॥లకు తిరిగి వచ్చి పశువులకు మేత వేసి, స్నానం చేసి 7.30 ని॥లకు తన గ్రామము నుండి బయలుదేరి 3 మైళ్ళ భీమనది ఏరులోను ఆపై 3 మైళ్ళ చంద్రగిరి కనుమ దారిలోనూ నడచి బడికి చేరుకొనేవారు. ఈ దారిలో రోజూ సుమారు వందమంది విధ్యార్ధులు ఆదారిలో నడిచి బడికి చేరేవారు.
విద్యాభ్యసంలోనే సుబ్బరామయ్య పంతులు రామాయణ, భాగవత, భారతాలలో మంచి ఘనపాటి. ఈయన పాఠశాల అంతా నీతి వాక్యములు ఆనాడే వ్రాయించి ఉంచినాడు. పిల్లలకు సనాతన ధర్మాలు నేర్పేటందుకు ఆసక్తి చూపేవారు. చంద్రబాబు నాయుడుకు చిన్నతనం నుంచి దైవభక్తి అలవడిరది. ఒకటి నుంచి నాల్గువ తరగతి వరకు తెలుగు, లెక్కలు అనర్గళంగా నేర్పించాడు. ఐదవ తరగతి నందు చంద్రబాబుకు ఇంగ్లీషు నేర్పి ఇంగ్లీషు పుస్తకం చదివేటట్లు ఏర్పాటు చేసేవాడు. ఐదవ తరగతి నందు చంద్రబాబు నాయుడుకు ఇంగ్లీషు అక్షరాభ్యాసం చేయించాడు. అంత మంచి గురువు దొరకడం చంద్రబాబు నాయుడి పూర్వజన్మ సుకృతం. భారత, భాగవత, రామాయణ, సుమతి వేమన పద్యాలు నేర్పింది, బాల్యంలో క్రమశిక్షణ అంటే ఏమిటో నేర్పింది గూడ ఈయనే. ఆయన గొప్ప ఆదర్శ ఉపాధ్యాయుడన్న మాట.
క్లాస్‌లీడర్
మూడవ తరగతి యందు ప్రతి వారం శనివారము సాయంకాలం ఒక్కొక్కొ విద్యార్ధి సుమతి శతకంలో ఒక్కొక్క పద్యాన్ని హోం వర్కుల పలకలో వ్రాసుకొని పోయి సోమవారం ప్రార్ధన కాగానే పిల్లల దగ్గర నుంచి ‘సుమతి పద్యం’ నీతి పద్యాలు అప్పజెప్పించు కొనేవారు. ఇది ప్రతివారం జరిగే కార్యక్రమం. చాలా మందికీ సుమతీ, వేమన పద్యాలు, ఎక్కములు సునాయాసంగా నోటికి వచ్చేవి. అయితే అనుకోకుండా చంద్రబాబు నాయుడు ఒకరోజు శనివారము బడికి హాజరు కాలేదు. సోమవారము ఉదయం గరువు గారికి పద్యము చెప్పాలి. ఎట్లా అని ఆలోచించాడు. రెండవ వరుసలో కూర్చునే చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యపూర్వకముగా చివరి వరుసలోనికి వెళ్లిపోయాడు. గురువు గారు యధా ప్రకారము పద్యాన్ని ఒప్పచెప్పు కోవడము చేశాడు. అందులో రెండవ విద్యార్ధి పద్యములో ఒక తప్పును చెప్పాడు. అది గురువుగారు గ్రహించి ఆ విద్యార్ధిని చూసి క్షమించి వదిలేశాడు. చంద్రబాబు నాయుడ దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు గారు కూడా అదే పద్యాన్ని అదే తప్పుతో చెప్పాడు. గురువుగారు చంద్రబాబు నాయుడును గుర్తించాడు. రెండం వరుసలో ఉన్నవాడు చివర వరుసలోకి ఎందుకు వెళ్ళాడని చంద్రబాబు నాయుడుని పిలిచి అడిగాడు. గురువు గారి సందేహం ప్రక్కన ఉన్న వాడితో గొడవ పడ్డామేమోనని సందేహం. చంద్రబాబు నాయుడుని తగ్గరకు పిలిచి చొక్కా కాలర్ పట్టుకొని పద్యములో తప్పు ఎందుకు చెప్పావు? అని అడిగాడు. అందుకు చంద్రబాబు నాయుడు సమాధానం ఇస్తూ నేను శనివారము రాలేదు, అయిన మీరు నన్ను దండిస్తారని తెలుసు, అందుకే చివరి వరుసలో కూర్చొని ఏది సులభంగా ఉంటే ఆ పద్యాన్ని గ్రహించి మీకు అప్ప చెప్పను. ఆ పరంపరలో రెండవ వాడి పద్యాన్ని గ్రహించి మీకు ఎలా చెప్పాడో అలాగే చెప్పేశాను. ఉన్న నిజాన్ని చెప్పి నన్ను మన్నించానలి గురువు గారిని కోరాడు. ఆ గురవు గారు ఆ నాడు పొందిన సంతోషించాడు. మనసులో చంద్రబాబు నాయుడు ఏక సంతాగ్రాహతనాన్ని గుర్తించి మనసార దీవించి క్లాస్‌లీడర్‌గా చేశాడు. సదరు గురువుగారు ఆ సన్నివేశాన్ని అప్పుడప్పుడు చెప్పి నవ్వుతూ నవ్వించేవారట.
పదో తరగతి చదువుకునే రోజుల్లోనే నారావారిపల్లెలో ‘వినాయక యువజన సంఘం’ పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి శ్రమించారు. గ్రామంలో మట్టి రోడ్లును వేసి పచ్చదనం పెంచడంలో భాగంగా మట్టిరోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించి వాటికి పేర్ల పెట్టి రోజూ సంరక్షించే బాధ్యతలు స్నేహితులతో కలిసి చేపట్టారు.